Share News

విద్యార్థులకు విలీన భయం..

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:37 PM

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ హ్యుమన్‌ క్యాప్టల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్సియేటీవ్‌(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థులకు విలీన భయం..
Telangana polytechnic merger

  • స్కిల్‌ వర్సిటిలో పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  • నేరుగా బీటెక్‌ చదివే అవకాశం కోల్పోతామని విద్యార్థుల ఆందోళన

  • ప్రభుత్వ నిర్ణయంపై వారం రోజులుగా విద్యార్థుల నిరసనలు

బెల్లంపల్లి(మంచిర్యాల): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ హ్యుమన్‌ క్యాప్టల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్సియేటీవ్‌(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శక్తిలో విలీనం చేస్తే విద్యార్థుల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారుతుందని నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ కళా శాలల్లో విద్యను అభ్యసిస్తూ ఉపాధి అవకాశాలు దక్కించుకుంటున్నారు.


పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడేళ్ల కోర్సు అనంతరం విద్యార్థులు జీవితంలో స్థిర పడేందుకు ఉద్యోగాలు వెతు కున్నే అవకాశం ఉంటుంది. కోర్సుల అనంతరం ఉన్నత విద్యవైపు వెళ్లేవారికి నేరుగా బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారు. అయితే తాజాగా పాలి టె క్నిక్‌ను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటిలో, పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ మాడల్‌గా విలీనం చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని కళాశాలలను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని కొన సాగించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిర సనలు తెలుపుతున్నారు.


విద్యార్థుల్లో భయం...

జిల్లాలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు శ్రీరాంపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రతి ఏడాది దా దాపు వెయ్యి మందికిపైగా విద్యార్థులు పాలిటెక్నిక్‌ విద్య ను అభ్యసిస్తున్నారు. పదో తరగతి పూర్తయిన తరువాత పాలిసెట్‌ రాసి పాలిటెక్నిక్‌లోని వివిధ కోర్సుల్లో వేలాది మంది విద్యార్థులు జాయిన్‌ అవుతున్నారు. ఆర్థికంగా వెనుకబడినవారు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా పాలిటెక్నిక్‌వైపు మొగ్గు చూపుతున్నారు.


ఉన్నత విద్యా అవకాశాలతో పాటు చిన్న వయస్సు లోనే ఉపాధి అవకాశాలు పొందవచ్చునని ఆలోచనతో పాలిటెక్నిక్‌ కోర్సును తీసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ వర్సిటిలో విలీనం చేస్తూ జీవో 97ను జారీ చేసింది. ఇందులో భాగంగా స్కిల్‌ యునివర్సిటి పరిధిలో తీసుకరావడం వల్ల మూడేళ్ల శ్రమ వృథా అవుతుందనిపాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవిలీనం వల్ల ఇంజ నీరింగ్‌ చేయాలంటే మరో రెండేళ్లు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో చేరాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అంతేగాకుండా డిప్లోమా పూర్తి చేసిన విద్యార్థులను స్కిల్స్‌, అన్‌స్కిల్స్‌కు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విలీనం చేయడంత డిప్లోమా ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు సైతం పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్కిల్‌ యునివర్సిటి అనేది పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌ నర్‌షిప్‌ మాడల్‌ కావడంతో విద్యా వ్యవస్థ అంతా ప్రైవేటు చేతుల్లో బందీ ఏర్పడుతుండడంతో పాటు ఆర్థిక భారం పడే అవకాశాలు సైతం లేక పోలేదు. ప్రస్తుతం మూడూళ్ల డిప్లోమాకు దాదాపు 12వేల నుంచి 15వేల వరకు ఒక్కో విద్యార్థికి ఖర్చు అవుతుంది. స్కిల్‌ యూని వర్సిటిలో ఒక్క ఏడాది కోర్సుకు అయ్యే ఖర్చు మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యాప కులు పేర్కొంటున్నారు.


వారం రోజులుగా విద్యార్థులు, అధ్యాపకుల నిరసనలు..

రాష్ట్ర ప్రభుత్వం 97 జీవోను తీసుకవచ్చి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల జీవితాలతో చెల గాటం ఆడుతుందని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, అధ్యా పకులు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటికి పాలిటెక్నిక్‌ కళాశాలలను అనుసం ధానం చేయవద్దంటూ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిం చడంతో పాటు ప్రధాన చౌరస్తాల వద్ద ధర్నాలు చేపడుతున్నారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు, అధ్యాపకులకు బీఆర్‌ఎస్‌వి, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ వంటి విద్యార్థిసంఘాల నాయకులు మద్ధతు పలుకుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం విద్యను శక్తిలోకి మార్చే ఆలోచనను విరమించుకోవాలని యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలనే డిమాండ్‌ చేస్తున్నారు.


విలీనం చేయడం సరైంది కాదు...

  • ఎ. సురేశ్‌, లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ కళాశాల

పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటి పరిధి లోకి విలీనం చేయడం సరైందికాదు. పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను ప్రభు త్వం పరిరక్షించాలి. జీవో 97ను వెంట నే రద్దు చేయాలి. గత వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలి.


విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడవద్దు...

  • రోహిత్‌, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థి

ఎంతో మంది విద్యార్థులు చిన్న వయస్సుల్లోనే ఉపాధి అవకాశాలు దక్కించుకొని స్థిరపడవచ్చనే ఆలోచ నతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరుతు న్నారు. ప్రభుత్వం నూతనంగా తీసు కొచ్చిన జీవోతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది స్కిల్‌ యూనివర్సిటికి పాలిటెక్నిక్‌ కళాశాలలను అనుసంధానం చేయడం సిగ్గు చేటు. నూతనంగా తీసుకొచ్చిన జీవోతో మూడేళ్ల విద్య వృథా అవుతుంది. నేరుగా ఇంజనీరింగ్‌ సెకండి యర్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉండదు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జీవో 97ను రద్దు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా 25న..

దొంగ, పోలీస్‌.. చెట్టపట్టాల్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 12:37 PM