మూడు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు నిజం చేస్తున్నారు: మంత్రి నిమ్మల..
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:14 AM
కరవు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అమరావతి: ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని కరవు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 31న వెలిగొండను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆగస్టు 31న వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన త్యాగధనులకు పరిహారం ఇచ్చాకే నీళ్లు వదలాలని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ మేరకు 40 రోజుల్లోనే మూడు దశల్లో రూ.760 కోట్లను వెలిగొండ నిర్వాసితులకు ఇచ్చామని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన రెండేళ్ల వ్యవధిలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు రూ.3 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. వెలిగొండలో అర్హత ఉన్న ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
వెలిగొండ పనులు పూర్తి కాకుండానే వైఎస్ జగన్ నాడు ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని నిమ్మల మండిపడ్డారు. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు నిజం చేస్తున్నారని ప్రశంసించారు. ఎల్-నినో వంటి క్లిష్ట సమయంలోనూ నల్లమల సాగర్‌కు 10.5 టీఎంసీల జలాలను తీసుకొస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి ఆకాంక్షించారు. కాగా, ఈరోజు వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్లను మూడో విడత కింద సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పోలవరం జిల్లా బొడుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని..
వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ