Share News

పోలవరం జిల్లా బొడుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని..

ABN , Publish Date - Aug 22 , 2026 | 07:56 AM

పోలవరం జిల్లా చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

పోలవరం జిల్లా బొడుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని..
Bodugudem Road Accident

పోలవరం జిల్లా: చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి తమిళనాడుకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


మృతులను తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అయ్యన్న (35), తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన ఆడివి సూర్య వినయ తేజ (28)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. తమ వారిని కోల్పోవడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ‘ఏఐ’ మోడల్‌ భేష్‌..!

ప్రియాంక కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

Updated Date - Aug 22 , 2026 | 07:58 AM