Share News

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా 25న..

ABN , Publish Date - Aug 22 , 2026 | 09:35 AM

క్యూర్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా 25న..
Indiramma Housing Towers

  • 27 నుంచి లక్కీ డ్రా

హైదరాబాద్‌ సిటీ: క్యూర్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్‌ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్‌సైట్‌ https://tghb.telangana.gov.inలో క్యూర్‌ స్టేట్‌సలో అప్లికేషన్‌ /ఫోన్‌ నంబర్‌ ఆధారంగా స్టేటస్‌ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.


zz.jpgఅభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్‌సైట్‌లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ, పోలీస్‌.. చెట్టపట్టాల్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:35 AM