Share News

చెరువు నుంచి బయటకు వస్తే నరకమే.. 16 ఏళ్ల బాలుడి వింత ఆరోగ్య సమస్య..

ABN , Publish Date - Aug 22 , 2026 | 10:10 AM

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శరీరంలో తీవ్రమైన మంట, వేడి అనిపించడంతో ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఎక్కువ సమయం చెరువు నీటిలోనే గడుపుతున్నాడు.

చెరువు నుంచి బయటకు వస్తే నరకమే.. 16 ఏళ్ల బాలుడి వింత ఆరోగ్య సమస్య..
16 year old boy pond

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శరీరంలో తీవ్రమైన మంట, వేడి అనిపించడంతో ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఎక్కువ సమయం చెరువు నీటిలోనే గడుపుతున్నాడు. బయటకు వచ్చినప్పుడు మంట భరించలేనంతగా పెరుగుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు (16 year old boy pond).


గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న ఇక్బాల్‌ను పలువురు డాక్టర్లకు చూపించినప్పటికీ సమస్యకు ఇప్పటివరకు స్పష్టమైన కారణం తెలియలేదు. వైద్యులు అతడికి 'ఎరిథ్రోమెలాల్జియా' అనే అరుదైన వ్యాధి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. ఎరిథ్రోమెలాల్జియా అనేది నరాలు, చిన్న రక్తనాళాలకు సంబంధించిన అరుదైన సమస్య. ఈ వ్యాధి ఉన్న వారి చేతులు, కాళ్లు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో తీవ్రమైన మంట, ఎర్రబడటం, వేడి, వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు (Erythromelalgia symptoms).


వేడి వాతావరణం, వ్యాయామం, బిగుతైన దుస్తులు, ఒత్తిడి, శరీరంలో నీరు తగ్గడం, మద్యం, కారంగా ఉండే ఆహారం వంటి అంశాలు ఈ అనారోగ్య సమస్యను ప్రేరేపించవచ్చు (Rare disease). చల్లదనం తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. అందువల్లే ఇక్బాల్ ఎక్కువ సమయం నీటిలో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి పరీక్ష అంటూ లేదు. లక్షణాలు, వైద్య చరిత్ర, శారీరక పరీక్ష ఆధారంగా పరిస్థితిని అంచనా వేయడం మాత్రమే కుదురుతుంది.


ఇవి కూడా చదవండి..

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..


మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 22 , 2026 | 10:10 AM