Share News

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..

ABN , Publish Date - Aug 22 , 2026 | 08:06 AM

బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ రోబో-2026 సదస్సులో చైనా హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో బాక్సింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, టేబుల్ టెన్నిస్ ఆడటం వంటి పనులను రోబోలు ప్రదర్శించాయి.

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..
humanoid robot boxing

ఇంటర్నెట్ డెస్క్: బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ రోబో-2026 సదస్సులో చైనా హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో బాక్సింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, టేబుల్ టెన్నిస్ ఆడటం వంటి పనులను రోబోలు ప్రదర్శించాయి. అయితే ఇదే సదస్సులో ఓ రోబో చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది (China humanoid robot).


హ్యూమనాయిడ్ రోబోలలో శారీరక కదలికలు, సమతుల్యత, వేగం వంటి అంశాల్లో చైనా సంస్థలు గణనీయమైన పురోగతి సాధించాయి. సదస్సులో కొన్ని రోబోలు బాక్సింగ్‌తో పాటు డ్యాన్స్, టేబుల్ టెన్నిస్ వంటి ప్రదర్శనలు చేశాయి. అయితే ఒక సాధారణ పనిని మాత్రం చేయలేకపోయాయి. ఒక రోబోను చొక్కాను మడతపెట్టమని కోరారు. మనిషి సులభంగా చేసే ఈ సాధారణ పనిని పూర్తి చేయడానికి రోబో చాలా నిమిషాల పాటు ప్రయత్నించింది. కానీ చివరికి చొక్కాను సరిగ్గా మడతపెట్టలేకపోయింది (Humanoid robot boxing).


చైనా ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగంలో ప్రపంచంలోనే ముందంజలో ఉంది (Chinese robots). కర్మాగారాలు, ఇళ్లు, హోటళ్లు వంటి వాస్తవ ప్రపంచంలో నిరంతరం ఉపయోగపడే స్థాయికి రోబోలను తీసుకెళ్లడమే లక్ష్యంగా పలు సంస్థలు పని చేస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు అలాంటి స్థాయికి చేరుకోవడానికి రెండు నుంచి పదేళ్లు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనిషి ఆలోచించకుండా చేసే చిన్న చిన్న పనులను కూడా చేయగలిగినప్పుడే హ్యూమనాయిడ్ రోబోలు నిజంగా మన జీవితాల్లోకి వచ్చినట్టవుతుంది.


ఈ వార్తలనూ చదవండి:

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

Updated Date - Aug 22 , 2026 | 08:06 AM