Share News

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:39 AM

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు
Imran Khan sent back to Adiala Jail

ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది.


ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో అమెరికా రహస్య మార్గం

అమెరికా అప్పులు.. 3,896 లక్షల కోట్లు

Updated Date - Aug 21 , 2026 | 10:48 AM