Share News

హోర్ముజ్‌లో అమెరికా రహస్య మార్గం

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:48 AM

మధ్య ఆసియాలో అమెరికా- ఇరాన్‌ దేశాలు యుద్ధంలో ఆధిపత్యం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయగా...

హోర్ముజ్‌లో అమెరికా రహస్య మార్గం

రాత్రిపూట చమురు నౌకలు తరలిస్తున్న ఆ దేశ మిలిటరీ

  • పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి రోజూ కోటి బ్యారెళ్ల ముడిచమురు రవాణా.. జలసంధి దక్షిణ భాగం నుంచి చడీచప్పుడు లేకుండా ప్రయాణం

వాషింగ్టన్‌, ఆగస్టు 20: మధ్య ఆసియాలో అమెరికా- ఇరాన్‌ దేశాలు యుద్ధంలో ఆధిపత్యం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయగా.. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాల నుంచి చమురు నౌకలను రహస్యంగా జలసంధిని దాటించేందుకు అమెరికా కొత్త ఎత్తుగడ వేసినట్లు బయటపడింది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి చమురు బయటకు రాకుండా అడ్డుకుంటే ప్రపంచమంతా చమురు ధరలు పెరిగి అమెరికా దిగి వస్తుందని ఇరాన్‌ భావించింది. అయితే, ఇరాన్‌ కళ్లుగప్పి రోజూ భారీ మొత్తంలో చమురు బయటకు వస్తున్నట్లు తేలింది. అమెరికా నౌకాదళం, వాయుసేన రక్షణలో సౌదీ, యూఏఈ, ఖతర్‌ తదితర దేశాల నుంచి లక్షలకొద్ది బ్యారెళ్ల ముడిచమురు హోర్ముజ్‌ను దాటి వెళ్తోందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్‌ వార్తా సంస్థ తెలిపింది. రోజుకు ఏకంగా కోటి బ్యారెళ్ల చమురు రహస్యంగా జలసంధిని దాటి ప్రపంచవ్యాప్తంగా వెళ్తోందని పేర్కొంది. యుద్ధానికి ముందు చమురు నౌకలు పర్షియన్‌ గల్ఫ్‌లో ఉత్తర భాగం (ఇరాన్‌ తీరం వెంట) ప్రయాణించేవి. వాటిని ఇరాన్‌ తేలిగ్గా అడ్డుకొనేది. దీంతో అమెరికా మిలిటరీ జలసంధి దక్షిణ భాగం (ఒమాన్‌ తీరం వెంట) నుంచి ఓ మార్గాన్ని ఏర్పాటు చేసింది. రోజుకు 10 నుంచి 15 భారీ చమురు ట్యాంకర్లను ఈ మార్గంలో గత రెండు నెలలుగా పంపిస్తోందని ఆక్సియోస్‌ తెలిపింది. గత పది రోజుల నుంచి రోజూ దాదాపు కోటి బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా జలసంధిని దాటిస్తోందని పేర్కొంది.


ఇరాన్‌ నిఘా వెన్ను విరిచి..

ఈ జలమార్గం చాలా ఇరుకుగా ఉండటంతో దక్షిణ తీరం నుంచి ప్రయాణించే నౌకలను కూడా ఐఆర్‌జీసీ తేలిగ్గా గుర్తించగలదు. ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు అమెరికా మిలిటరీ మొదట ఇరాన్‌లోని రాడార్‌ వ్యవస్థలను ధ్వంసం చేసింది. దీంతో జలసంధిలో ప్రయాణించే నౌకలను గుర్తించే సామర్థ్యాని ఇరాన్‌ చాలావరకు కోల్పోయింది. అయినా, అమెరికా మిలిటరీ ముందు జాగ్రత్తగా చమురు ట్యాంకర్లన రాత్రిపూట మాత్రమే పంపిస్తున్నట్లు ఆక్సియోస్‌ తెలిపింది. అమెరికా నేవీ ఈ ట్యాంకర్లకు ఎస్కార్టుగా వెళ్తున్నట్లు వెల్లడించింది. ఆకాశం నుంచి ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులు రాకుండా అమెరికా వైమానిక దళం అడ్డుకుంటోంది. అంతేకాకుండా జలసంధిని దాటే సమయంలో చము రు నౌకల నావిగేషన్‌ వ్యవస్థలను నిలిపేస్తున్నారు. దీంతో వాటిని గుర్తించటంలో ఐఆర్‌జీసీ విఫలమవుతోంది. ప్రస్తుతం రోజుకు 1.5కోట్ల నుంచి 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును జలసంధి ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక వేసినట్లు ఇద్దరు అమెరికా అధికారులు ఆక్సియో్‌సకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:48 AM