Share News

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:47 PM

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పోలాండ్ రాయబారి ప్యోటర్ ఆంటొనీ స్విటాల్స్కీ తెలిపారు.

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు
Poland Envoy Piotr Antoni Świtalski,

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పోలాండ్ రాయబారి ప్యోటర్ ఆంటొనీ స్విటాల్స్కీ తెలిపారు. స్వయంగా ఉగ్రవాద బాధితులమైనందున తాము భారత్‌కు ఈ విషయంలో మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే, భారత్‌లో ఉగ్రవాదులు భయానక దారుణాలకు ఒడిగట్టారని అంగీకరించారు. ఈ విషయంలో భారత్‌తో తమ దేశాన్ని పోల్చలేమని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘భారత్‌లో టెర్రరిస్టులు భయానక దాడులు చేశారు. ఈ విషయంలో మేము భారత్ వైపే ఉన్నాము. టెర్రరిస్టులు ఎక్కడున్నా వెంటాడే హక్కు భారత్‌కు ఉందని గతంలోనే మేము స్పష్టం చేశాము. ఈ విషయంలో మా విధానం స్పష్టంగా ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోలాండ్‌కు చెందిన డ్రోన్‌లను భారత్ వాడిందన్న వార్తలపై కూడా రాయబారి స్పందించారు. పాక్‌‌ను తప్పుదారి పట్టించేందుకు కొన్ని పోలాండ్ డ్రోన్స్‌ను భారత్ వాడి ఉండవచ్చని అన్నారు. ఈ విషయంలో పాక్‌ను అడ్డుపెట్టుకుని పోలాండ్‌పై వచ్చిన విమర్శలు తమను ఆశ్చర్యపరిచాయని వ్యాఖ్యానించారు. దీని వెనుక ఏదైనా విదేశీ అజెండా ఉందా? అప్పట్లో తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు.


పలు రంగాల్లో పొలాండ్‌కు భారత్ ప్రభావశీలమైన భాగస్వామిగా ఉందని అన్నారు. విచ్ఛిన్నకర శక్తుల ప్రభావంతో అతలాకుతం అవుతున్న ప్రస్తుత ప్రపంచానికి స్థిరత్వాన్ని, సుపరిపాలనను అందించే ద్వయంగా భారత్, పోలాండ్ నిలుస్తాయని అన్నారు.

రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా పోలాండ్ చిన్నారులకు ఆశ్రయమిచ్చిన నవానగర్ మహారాజ్ సర్ దిగ్విజయ్‌సింగ్‌జీ, రంజిత్ సింగ్‌జీ జడేజాను కూడా పోలాండ్ రాయబారి గుర్తు చేసుకున్నారు. పోలాండ్ ప్రజలకు ఆయన మంచిమారాజుగా గుర్తుండిపోయారని తెలిపారు. తమ దేశంలో ఓ కూడలికి ఆయన పేరు కూడా పెట్టుకున్నామని చెప్పారు. తన ఇంటిపేరులో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయని అన్నారు. పోలాండ్, భారత్‌లు బింబప్రతిబింబాలని కూడా వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

కూలిన బంగారం గని.. 30 మంది దుర్మరణం

Updated Date - Aug 21 , 2026 | 03:08 PM