Share News

డిజిటల్‌ యుగంలో కళ్లకు ముప్పు.. జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:53 PM

సృష్టిలోని సౌందర్యాన్ని తిలకించడానికి కంటి చూపే ఆధారం.

డిజిటల్‌ యుగంలో కళ్లకు ముప్పు.. జాగ్రత్తలు తప్పనిసరి
Eye Health

  • నేడు ప్రపంచ దృష్టి ప్రాధాన్య దినోత్సవం

పెద్దపల్లి: సృష్టిలోని సౌందర్యాన్ని తిలకించడానికి కంటి చూపే ఆధారం. చూపు ప్రాధాన్యతను గుర్తించి, నివారించదగిన అంధత్వంపై సమాజంలో చైతన్యాన్ని నింపడానికి ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌నెస్‌ ఆధ్వర్యంలో యేటా అక్టోబరు రెండో గురువారాన్ని ప్రపంచ దృష్టి ప్రాధాన్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈయేడు ప్రపంచ ప్రచార నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.


  • డిజిటల్‌ యుగంలో కంటికి గ్రహణం

నేటి ఆధునిక జీవనశైలిలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్ర్కీన్ల ముందే కాలాన్ని గడి పేస్తున్నాం. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటంతో కళ్లకు విశ్రాంతి తగ్గడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లల నుంచి పెద్దల వరకు ఐ స్ట్రెయిన్‌, కళ్ళు పొడిబారడం, మంటలు, తలనొప్పి, చూపు మస కబారడం సమస్యల బారిన పడుతున్నారు.


  • మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్‌ రెటినోపతి వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. నెలలకోసారి తప్పనిసరిగా రెటినా పరీక్ష చేయించుకోవాలి.

  • పుస్తకాలు, మొబైళ్లను దగ్గరగా పెట్టుకోవ డం, తరచూ కళ్లు రుద్దడం, క్లాస్‌రూమ్‌లో బోర్డు సరిగా కనిపించకపోవడం, తలనొప్పి ఉంటే వెంటనే వైద్యుడికి చూపించాలి.

  • స్క్రీన్లపై పనిచేసేటప్పుడు ప్రతి 20 నిమి షాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లపాటు చూడాలి.


pdp1.2.jpg

  • విటమిన్‌ ఏ లభించే క్యారెట్లు, ఆకుకూర లు, పాలు, తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తినాలి.

  • వైద్యుడి సలహా లేకుండా షాపుల్లో కొన్న కంటి చుక్కల మందులు వాడకూడదు.

  • మనం లేని లోకంలో మరొకరి చూపుగా జీవించే అవకాశం నేత్రదానం. చీకటిలో మగ్గు తున్న ఎంతోమంది కార్నియల్‌ అంధుల జీవితా ల్లో కొత్త కాంతులు నింపేందుకు ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలి.


వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు

  • పూదరి దత్తాగౌడ్‌, లయన్స్‌ క్లబ్‌ విజన్‌ కేర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు

లయన్స్‌ విజన్‌ కేర్‌ అంధత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. లయన్స్‌ విజన్‌ నేడు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. లయన్స్‌ ప్రతినిధులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అవసరమైన పేదలకు ఇప్పటివరకు 50,673 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశాం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్‌ కమిటీ భేటీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 12:53 PM