Share News

మానుకోట ఆస్పత్రిలో మాయాజాలం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:04 PM

ప్రభుత్వ వైద్యశాలల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డులను థర్డ్‌ పార్టీ లేబర్‌గా ప్రభుత్వం నియమించింది.

మానుకోట ఆస్పత్రిలో మాయాజాలం
Mahabubabad Govt Hospital

  • థర్డ్‌ పార్టీ సిబ్బంది నియామకంలో ప్రైవేటు సంస్థ వసూళ్లు

  • వేతనాల్లో కోతలు..యథేచ్ఛగా శ్రమ దోపిడీ

  • ఎలక్ట్రిషియన్‌ పనులకు శానిటేషన్‌ సిబ్బంది వాడకం

మహబూబాబాద్‌: ప్రభుత్వ వైద్యశాలల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డులను థర్డ్‌ పార్టీ లేబర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే ఈ సదుపాయం ఇప్పుడు కొద్దిమంది స్వార్థపరులకు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులకు కాసుల వర్షం కురిపించేదిగా మారిందనే ఆరోపణలు తీవిన్పిస్తున్నాయి.


సంస్థ నిబంధనలప్రకారం ఆస్పత్రిలో నియ మించే శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ సిబ్బందివద్ద ఎలాంటి డబ్బులువసూలు చేయ కూడదు. అలాగే వారికి కేటాయించిన విధుల్లో మాత్రమే వారిని వినియోగించాలి. ఇతర పను ల కోసం వారిని వాడుకోకూడదు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కొందరు అధికారులు, సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై సిబ్బంది నియామకం పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుఆరోపణలున్నాయి. ఇటీవలే ముగ్గు రు సిబ్బంది నియామకంలో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ప్రచా రం జరుగుతోంది. ఈ విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు, సంస్థ ఎం.డి.కి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తన వ్యక్తిగత అవసరాల కోసం, తన సొంత కార్‌ డ్రైవర్‌గా సంస్థ సిబ్బందిని వాడుకుంటున్నారనే ఆరోపణ లు బహిరంగ రహస్యంగా మారాయి. నిబంధనల ప్రకారం రోగుల సేవల కోసం కేటాయించి న సిబ్బందిని ఇలా వ్యక్తిగత పనులకు వాడుకోకూడదు. అలాగే ఆస్పత్రిలో సాంకేతిక పనులు చూసేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రిషియన్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. కానీ, ఎలక్ట్రిషియన్లను నియమించకుండా సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాధారణ శానిటేషన్‌ లేబర్‌తో ఎలక్ట్రిషియన్‌ పనులు చేయిస్తున్నారు. మరోవైపు సిబ్బందికి చెల్లించాల్సిన జీతాల విషయంలోనూ సంస్థ మోసాలకు పాల్పడుతున్నట్లు లెక్కలు బయటపడుతున్నాయి. ప్రభుత్వంనిర్ణయిం చిన వేతనాలను ఇవ్వకుండా కార్మికుల జేబులకుచిల్లు పెడు తున్నారని చెబుతున్నారు.


mbd1.2.jpgకార్మికులకు కోతలు

ప్రైవేటు సంస్థ ద్వారా నియమితులైన సిబ్బందికి ప్రభుత్వం ప్రతీ నెల రూ.15,600 చెల్లిస్తుంది. కానీ, వివిధ కారణాల పేరుతో వారి జీతాలకు కోతలు పెడుతూ అసలుకే ఎసరు వచ్చేలా చేస్తున్నారు. భవిష్య నిధి (పీఎఫ్‌) కటింగ్‌ 12 శాతం రూ. 1872, ఈఎ్‌సఐ కటింగ్‌ 0.75శాతం రూ. 117, కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో రూ. 11,093 మాత్రమే జమ చేస్తున్నారు. భవిష్య నిధి కింద రూ.1093, బీమా కింద రూ.93 మాత్రమే కట్‌ అవుతుందని నమ్మిస్తున్నారు.


వారు చెబుతున్న లెక్క ప్రకారమే చూసినా (రూ. 11,093, రూ. 1093, రూ. 93) కలిపితే మొత్తం రూ.12,279 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 15,600 లో కార్మికులకు రూ. 12,279 మాత్రమే చూపించి, మిగిలిన రూ. 3321 కంపెనీ అక్రమంగా తన జేబులో వేసుకుంటోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇటీవలే సిబ్బంది అందరూ మెటాఫోర్స్‌ సూపర్‌వైజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ వద్ద నుంచి ఎలాంటి రూపాయలు వసూలు చేయవద్దు అని వేడుకున్నారు.


సిబ్బంది లేక సమన్వయం చేస్తున్నాం..

  • బత్తుల శ్రీనివాస్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఎలక్ట్రిషన్‌ విభాగంలో సిబ్బంది లేక ప్రైవేటు సంస్థ సిబ్బందితో సమన్వయం చేస్తు న్నాం. వారి సిబ్బందిని నియమించే విషయంలో మా జోక్యం లేదు. నా కార్‌ డ్రైవర్‌ ప్రైవేటు సంస్థ సిబ్బందినే. ఆస్పత్రికి వచ్చే క్రమంలో వారిని ఉపయోగించుకుంటున్నా.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్‌ కమిటీ భేటీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 12:04 PM