తిరుపతి శ్రీసిటీలో అగ్నిప్రమాదం.. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:46 AM
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెనుప్రమాదం తప్పింది.
తిరుపతి జిల్లా, అక్టోబర్ 8: జిల్లాలోని శ్రీసిటీ వెంచర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
జిల్లాలోని శ్రీసిటీ వెంచర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ రోజు(గురువారం) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఏడు గంటల సమయంలో మిషనరీ విభాగంలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది.. అప్రమత్తమై శ్రీసిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. స్వల్ప అగ్నిప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టమేమీ జరగలేదని.. కానీ ఆస్తినష్టం వాటిల్లిందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెలాఖరులో జీఎస్‌ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 10.30 నుంచి కరెంట్ కట్