హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10.30 నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:02 AM
హైదరాబాద్ నగరంలోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతుల కారణంగా గురువారం 11కేవీ సలీంనగర్ మిల్క్ బూత్ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, గంజ్ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, ఎస్‌ఆర్‌టీ కాలనీ(సంతోష్‌నగర్) ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు,
హౌసింగ్ బోర్డు కాలనీ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 వరకు, పర్హత్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్ కమిటీ భేటీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News