Share News

ఫారం-7పై మేం చెప్పిందే నిజమైంది: టీపీసీసీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:01 AM

అర్హులైన ఓటర్లను వారి అనుమతి లేకుండా ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రి ఫిల్డ్‌ ఫారం-7లను సమర్పిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజే్‌షకుమార్‌ పేర్కొన్నారు.

ఫారం-7పై మేం చెప్పిందే నిజమైంది: టీపీసీసీ
TPCC Form 7 issue

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ఓటర్లను వారి అనుమతి లేకుండా ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రి ఫిల్డ్‌ ఫారం-7లను సమర్పిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజే్‌షకుమార్‌ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముషీరాబాద్‌, బహదూర్‌పుర, గోషామహల్‌ నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు తెలియకుండా ముందుగానే నింపిన ఫారం-7లను సమర్పిస్తున్నట్లు ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌లకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తుచేశారు.


తమ ఫిర్యాదు ఆధారంగా ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 31 ప్రి ఫిల్డ్‌ ఫారం-7లను బీఎల్‌వోకు సమర్పించిన వ్యవహారంపై ఎన్నికల అధికారులు విచారణ జరిపారని, ఈ ఫారాలను బీజేపీకి చెందిన 210వ పోలింగ్‌ బూత్‌ ఏజెంట్‌ ఎస్‌.బాలచందర్‌ సమర్పించినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఆయనపై తాజాగా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని చెప్పారు.


ఇవి కూడా చదవండి...
మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ

అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ట్రైబ్యునల్‌ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 07:01 AM