Share News

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:52 AM

ఓటు హక్కు ప్రతి పౌరుడికి గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఇస్తుందని, దాన్ని తొలగించే ప్రయత్నాలను అందరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు.

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి
Kodandaram

  • ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడాలి: కోదండరాం

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు ప్రతి పౌరుడికి గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఇస్తుందని, దాన్ని తొలగించే ప్రయత్నాలను అందరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్సీ, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రియ పేరుతో కోట్లాది ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ప్రతి వంద ఓట్లలో 21 ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.


ప్రజాస్వామ్యంలో ఎవరు గెలవాలన్నది ఎన్నికల కమిషనర్‌ నిర్ణయించే స్థాయికి పరిస్థితులు మారడం ప్రమాదకరమని హెచ్చరించారు. కాగా, టీజేఎస్‌ పార్టీ కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని కోదండరాం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌ రావు, సయ్యద్‌ బద్రుద్దీన్‌, అంబటి శ్రీనివాస్‌ తదితరులను నియమించారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...
మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ

అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ట్రైబ్యునల్‌ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:52 AM