తూర్పుగోదావరిలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:57 AM
తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులను వణికిస్తోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీ మాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పులి తిష్ట వేసినట్లు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు..
తూర్పుగోదావరి, అక్టోబర్ 8: జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీ మాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పెద్ద పులి తిష్ట వేసినట్లు స్థానికులు గుర్తించారు. ఆలయం వెనుక ఉన్న కొండతో పాటు సమీపంలోని క్వారీ ప్రాంతంలోనూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. రెండు రోజులుగా పులి కదలికలు కనిపిస్తున్నప్పటికీ అది పట్టుబడకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుందనే విషయాన్ని గుర్తించేందుకు కదలికలను పరిశీలిస్తున్నారు.
పులి సంచారం నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. క్వారీ ప్రాంతంలోకి కార్మికులు వెళ్లవద్దని.. అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. వరుసగా రెండు రోజులుగా అధికారులకు చిక్కకుండా పులి సంచరిస్తుండటంతో దాని కదలికలను గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. గౌరీపట్నంతో పాటు సమీపంలోని వివిధ గ్రామాల ప్రజలు పులి భయంతో ఆందోళన చెందుతున్నారు. పులి జనావాసాల్లోకి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News And National News