Share News

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:14 AM

: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో టీడీపీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో టీడీపీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అన్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా అడ్డు కొనేందుకు వైసీపీ నేతలు న్యాయస్థానా లను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేసిందన్నారు. అయితే వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నార న్నారు. 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు న్యాయపరమైన మార్గంలో కృషి చేస్తున్నారన్నారు. సమావే శంలో నగర పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ ప్రధాన విజయ రాం, నాయకులు కలగ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:14 AM