రూల్స్ జాన్తానై..భూపాలపల్లిలో వెంచర్ల దందా
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:26 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొందరు రెచ్చిపోతున్నారు. జిల్లాలో వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
ప్లాట్లుగా మారుతున్న వ్యవసాయ భూములు
అతి తక్కువ ధరకు కొనుగోలు.. భారీ రేట్లకు విక్రయాలు
నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ వ్యాపారులు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
భూపాలపల్లి: రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొందరు రెచ్చిపోతున్నారు. జిల్లాలో వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఎలాంటి డీటీసీపీ లేఅవుట్ (మునిసిపల్) అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తూ అమాయకులను వంచిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయు. ఎకరం రూ. 20లక్షలకు కొనుగోలు చేసిన భూమిని నిబంధనలను తుంగలో తొక్కి పదిరెట్లు అధిక ధరకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారని తెలుస్తోంది. మునిసిపల్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉదాసీనత వైఖరి కారణంగా ఈ అక్రమ లేఅవుట్ల దందా రోజురోజుకూ పుట్టగొడుగుల్లా విస్తరిస్తోంది.
కొంపల్లి, మంజూర్‌నగర్ మొదలుకొని..
భూపాలపల్లి మండలం కొంపల్లి శివారు మంజూర్‌నగర్‌లో ఇటీవల ఐదారుగురు వ్యక్తులు సర్వే నంబరు 177/ఊలోని ఎకరం భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీనిని కొంతమంది బ్రోకర్ల సహాయంతో ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా విభజించి పది రెట్లు ఎక్కువ ధరకు విక్రయించారని తెలిసిం ది. రూ.20లక్షలకు కొనుగోలు చేసి రూ.2కోట్లకు విక్రయిం చినట్లు సమాచారం. అలాగే భూపాలపల్లి పట్టణం పరిధి లోని సర్వే నంబరు 143లోని అర ఎకరం భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ లేకుండానే (నాలా కన్వర్షన్ ఫీజులు ఎగవేసి) అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మించి అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది.
నిబంధనలకు తూట్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి వెంచర్ అయినా ఏర్పాటు చేయాలంటే కనీసం 33 అడుగుల నుంచి 60 అడుగుల వెడల్పుతో అంతర్గత రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థ, పార్కుల కోసం ప్రత్యేక స్థలం కేటాయింపు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లేఅవుట్లలో వీటిని పూర్తిగా విస్మరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో రోడ్లు సరిగా లేకపోవడంతో పాటు కొనుగోలుదారులు భవిష్యత్‌లో రిజిస్ర్టేషన్లు, బ్యాంక్ లోన్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
చోద్యం చూస్తున్న అధికారులు
ఈ వెంచర్ల దందాపై మునిసిపల్, రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయి. ఈ వ్యాపారంలో కొందరికి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు బలంగా వినిపి స్తున్నాయి. నామమాత్రపు నోటీసులు ఇవ్వడంతో సరిపె డుతున్నారే తప్ప, వెంచర్లను కూల్చి వేయడం గానీ, క్రిమినల్ కేసులు నమోదు చేయడం గానీ చేయడం లేదని పలువురు తీవ్రంగా మండిపడుతు న్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమా యక ప్రజలను మోసగించి, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియాపై కలెక్టర్, ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే స్పందిం చి ప్రత్యేక విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్ కమిటీ భేటీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News