Share News

మెస్సికి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు.. ‘ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతం’

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:39 AM

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సి తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న బ్యూనస్ ఎయిర్స్‌లోని 'మాన్యుమెంటల్ స్టేడియం' వేదికగా బెనిన్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మెస్సి సంచలన ప్రదర్శన చేశాడు.

మెస్సికి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు.. ‘ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతం’
Lionel Messi

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో ఫుట్‌బాల్ ప్రపంచంలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెస్సి తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 6న బ్యూనస్ ఎయిర్స్‌లోని 'మాన్యుమెంటల్ స్టేడియం' వేదికగా బెనిన్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మెస్సి సంచలన ప్రదర్శన చేశాడు. ఒక గోల్ కొట్టడంతో పాటు రెండు అసిస్ట్‌లు అందించి జట్టును 3-0 తేడాతో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.


మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. అర్జెంటీనా జెర్సీని ధరించడాన్ని తాను ఇప్పటికే చాలా మిస్ అవుతున్నానని, తన దేశం కోసం ఆడటం ఎల్లప్పుడూ ఒక గొప్ప గౌరవమని తెలిపాడు. మెస్సి చేసిన ఈ పోస్ట్‌కు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. 'నా ప్రియమైన లియో.. నీ అద్భుతమైన ప్రదర్శనలతో అర్జెంటీనాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లావు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. నువ్వు సాధించిన విజయాలకు అభినందనలు' అని రొనాల్డో ప్రశంసల వర్షం కురిపించాడు.


మైదానంలో ప్రత్యర్థులుగా పోటీపడే వీరిద్దరూ, బయట మంచి స్నేహితులుగా ఉండటం అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికపై వీరిద్దరూ రెండుసార్లు ఒకరినొకరు ఎదుర్కొని, చెరొక విజయాన్ని అందుకున్నారు. మెస్సి సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు ఉన్నాయి. అతడి సారథ్యంలో అర్జెంటీనా జట్టు ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌2022లో విజేతగా, 2026 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుడా 2021, 2024లో రెండు కోపా అమెరికా టైటిళ్లను కూడా మెస్సి గెలుచుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

హస్తినాపురంలో నిలిపి ఉన్న కారు దగ్ధం.. కేసు నమోదు

విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల పంజా.. పలువురి అరెస్ట్

ఏసీ బస్సుల్లో తగ్గిన చార్జీలు

Updated Date - Oct 08 , 2026 | 10:41 AM