హస్తినాపురంలో నిలిపి ఉన్న కారు దగ్ధం.. కేసు నమోదు
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:02 AM
రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్, అక్టోబర్ 08: రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు దగ్ధం వ్యవహారంలో ఎవరైనా ఆకతాయిల ప్రమేయం ఉందా? లేకుంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హస్తినాపురం చౌరస్తా సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల పంజా.. పలువురి అరెస్ట్
ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్