Share News

ఏసీ బస్సుల్లో తగ్గిన చార్జీలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 08:28 AM

గ్రేటర్‌ హైదరాబాద్‏లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న పుష్పక్‌ ఏసీ బస్సుల్లో చార్జీలు తగ్గాయి.

ఏసీ బస్సుల్లో తగ్గిన చార్జీలు
Pushpak Bus Fare

  • ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో ప్రయాణికుల పెంపే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న పుష్పక్‌ ఏసీ బస్సుల్లో చార్జీలు తగ్గాయి. ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో 24 గంటలు ఆర్టీసీ నడుపుతున్న 40 పుష్పక్‌ బస్సుల్లో టికెట్‌ చార్జీలను 40 శాతం వరకు తగ్గించింది. ఈ చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో పుష్పక్‌ ఏసీ బస్సుల్లో ప్రయాణికులను పెంచేకునే లక్ష్యంగా గ్రేటర్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.


city4.2.jpgమంగళవారం వరకు మియాపూర్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి గచ్చిబౌలికి పుష్పక్‌ బస్సులో చార్జీ రూ. 350 వసూలు చేస్తుండగా బుధవారం నుంచి రూ.250కు తగ్గించారు. లింగంపల్లి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350 చార్జీ ఉండగా రూ.200కు, ఆల్విన్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి రూ.350 ఉండగా రూ. 200కు తగ్గించారు. కొత్తగూడ, గచ్చిబౌలి, శిల్పారామం నుంచి ఎయిర్‌పోర్టుకు రూ. 300 ఉండగా రూ. 150కి తగ్గించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్‌ కమిటీ భేటీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 09:04 AM