Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10.30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Aug 22 , 2026 | 07:11 AM

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10.30 నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్‌, నల్లకుంట 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్‌ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్‌ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

సైదాబాద్‌: టీజీఎస్‏పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్‌ బిస్కెట్‌ ఫ్యాక్టరీ ఫీడర్‌.. లక్ష్మీనగర్‌ ఎక్స్‌ రోడ్డు, రామాలయం, వాణినగర్‌, పటేలమ్మ మడిగలు, ఆనంద్‌ బిస్కెట్‌ ఫ్యాక్టరీ, దోబీఘాట్‌ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్‌ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్‌ ఫీడర్‌.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.


ఏఎస్‏రావు నగర్‌: చర్లపల్లి సాయినగర్‌ ఫీడర్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్‌ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్‌ఆర్‌ కాలనీ, కృష్ణారెడ్డినగర్‌, సుభా్‌షనగర్‌, రెడ్డికాలనీ, సాయినగర్‌, ఎన్‌ఎన్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు.


city1.2.jpgమౌలాలి సెక్షన్‌ పరిధిలో..

కాప్రా: విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్‌టీఎస్‌ తిరుమలనగర్‌, హనుమాన్‌నగర్‌, డాక్టర్‌ కృష్ణానగర్‌, శివానందనగర్‌, పోచమ్మ టెంపుల్‌, పిల్లి నర్సింగ్‌రావు నగర్‌, గౌసియా మజీద్‌ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు మౌలాలి సెక్షన్‌ ఏఈ తెలిపారు.


బోడుప్పల్‌లో...

ఉప్పల్‌: సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా 33 కేవీ విద్యుత్‌ లైన్‌ టవర్ల ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం బోడుప్పల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ బోడుప్పల్‌ సబ్‌ ేస్టషన్‌ నుంచి ఇండిరానగర్‌ 11కేవీ ఫీడర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈలు వినయ్‌ కుమార్‌ రెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. శ్రీ సాయి భవాని నగర్‌, సాయిరాం నగర్‌, శ్రీనివాస కాలనీ, ఎస్సీ బస్తీ, ఆనంద్‌ నగర్‌, బొమ్మక్‌ బ్రదర్స్‌ కాలనీ, బృందావన్‌ కాలనీ, తూర్పు, పశ్చిమ హనుమాన్‌నగర్‌, సాయిదుర్గానగర్‌, బయ్యన్నగూడ, గణేష్ నగర్‌ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 07:11 AM