Share News

మరుగుదొడ్డిని శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:45 AM

నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై..

మరుగుదొడ్డిని శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

పెంట్లవెల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మంత్రి స్వయంగా బకెట్‌లో నీరు తీసుకొని మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. వెంటనే రూ.450తో ఒక బకెట్‌, జగ్గు, ఫినాయిల్‌ డబ్బా, బ్రష్‌, తెప్పించి కార్యాలయానికి అందజేశారు. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మన బాత్రూమ్‌లను మనమే శుభ్రం చేసుకోవచ్చని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి మంత్రి సూచించారు.

Updated Date - Aug 22 , 2026 | 05:47 AM