Share News

నానా పటేకర్ మరణవార్త తెలిసి చింతిస్తున్నా: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:06 AM

గుండెపోటుతో మరణించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ మృతిపట్ల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు.

నానా పటేకర్ మరణవార్త తెలిసి చింతిస్తున్నా: పవన్ కల్యాణ్
Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 8: గుండెపోటుతో మరణించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ మృతిపట్ల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ... ప్రముఖ నటులు నానా పటేకర్ ఆకస్మిక మరణ వార్త తెలిసి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు నానా పటేకర్ అని కొనియాడారు. ‘క్రాంతివీర్’ చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిదన్నారు.


పరిందా, ఖామోషీ, తిరంగా, అగ్నిసాక్షి, నటసామ్రాట్, అబ్ తక్ చప్పన్, అపహరణ్ లాంటి చిత్రాలు నానా పటేకర్ నట జీవితంలో కొన్ని మచ్చు తునకలుగా చెప్పుకొచ్చారు. భారత సైన్యంలోనూ గౌరవపూర్వక సేవలందించారని తెలిపారు. నానా పటేకర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


కాగా.. ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలా ప్రాంతంలోని స్పృహతప్పి పడిపోయిన నానా పటేకర్‌ను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు ఆయనకు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తెల్లవారుజామున 5:20 గంటలకు గుండెపోటుతో నానా పటేకర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు

మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. నిందితుడి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 10:33 AM