గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:22 AM
పట్నా నుంచి లఖ్నవూ వెళుతున్న ఇండిగో విమానం పిడుగుపాటుకు గరైంది. దీంతో, విమానాన్ని యూపీలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పట్నా నుంచి లఖ్నవూ వెళుతున్న ఇండిగో విమానం పిడుగుపాటుకు గరైంది. దీంతో, విమానాన్ని యూపీలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే, పిడుగుపాటు కారణంగా విమానం ముందు భాగం కాస్త దెబ్బతిన్నది. విమానం సుమారు 17 వేల ఎత్తులో ఉన్నప్పుడు పిడుగుపాటుకు గురైంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. క్లియరెన్స్ లభించిన అనంతరం వినియోగిస్తారు.
గత నెలలో కూడా మరో ఇండిగో విమానం తోక భాగం స్వల్పంగా దెబ్బతింది. గువాహటీ నుంచి బయలుదేరిన విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో తోక భాగం రన్‌వేకు తగిని స్వల్పంగా దెబ్బతింది. వాతావరణం సరిగా లేకపోవడంతో ల్యాండింగ్ సమయంలో కొంత ఇబ్బందికరంగా మారిందని ఇండిగో తెలిపింది. వాతావరణం అనుకూలించక మొదటి సారి ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించుకున్న విమానం మరోసారి ల్యాండయ్యే సమయంలో ఇలా జరిగింది. అయితే, ఈ ఘటనలో విమానం సేఫ్‌గా దిగింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. తనిఖీల కోసం విమానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..
పీఎంపీ,ఆర్‌ఎంపీ వ్యవస్థల బలోపేతం: టీడీ