మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:44 AM
తెలుగుదేశం పార్టీతోపాటు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిని గుర్తించి.. నల్లపాడు పోలీసులు అర్టెస్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిందితుడు తీర్థాల నాగ వెంకట దుర్గా రాకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి, అక్టోబర్ 08: తెలుగుదేశం పార్టీతోపాటు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిని గుర్తించి.. నల్లపాడు పోలీసులు అర్టెస్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిందితుడు తీర్థాల నాగ వెంకట దుర్గా రాకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని గుంటూరు తరలించారు. సోషల్ మీడియాలో ఈ కల్పిత వీడియోలతోపాటు ఈ పోస్టుల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో నకిలీ ఎక్స్ ఖాతాను దుర్గా రాకేశ్ తెరిచి.. అందులో అతడు ఈ పోస్టులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు సృష్టించేలా కంటెంట్ ప్రచారం చేసినట్లు అతడిపై ఇప్పటికే కేసు నమోదయింది. నిందితుడు తీర్థాల నాగ వెంకట దుర్గా రాకేశ్ స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం.
ఈ వార్తలు కూడా చదవండి..
హస్తినాపురంలో నిలిపి ఉన్న కారు దగ్ధం.. కేసు నమోదు
ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్