Share News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ భద్రత పెంచిన కేంద్రం.. ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:34 AM

ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచుతూ గురువారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ భద్రత పెంచిన కేంద్రం.. ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
CEC Gyanesh Kumar

ఢిల్లీ, అక్టోబర్ 08: ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచుతూ గురువారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. ఇప్పటికే ఆయనకు వీఐపీ భద్రత ఉంది. దీనిని జెడ్ ప్లస్‌కు పెంచింది. ఢిల్లీతోపాటు ఆగ్రాలోని ఆయన నివాసం వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


దాంతో ఢిల్లీ, ఆగ్రాలోని ఆయన నివాసాలు, ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్‌తోపాటు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది. ఆయన రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన పర్యటన హాఠాత్తుగా వాయిదా పడింది. మళ్లీ ఈ పర్యటన ఎప్పుడు అనేది తర్వాత ప్రకటిస్తామని ఈసీ కార్యాలయం వెల్లడించింది. ఇంకో వైపు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని వివిధ నగరాల్లో ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. గర్భిణీ సహా బాలిక మృతి

Updated Date - Oct 08 , 2026 | 12:34 PM