Share News

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. గర్భిణీ సహా బాలిక మృతి

ABN , Publish Date - Oct 08 , 2026 | 08:11 AM

ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో అకస్మాత్తుగా భవనం కుప్పకూలిన విషాద ఘటనలో నాలుగు నెలల గర్భిణితో పాటు ఓ పన్నెండేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రక్షకదళాలు సహాయక చర్యలు చేపట్టగా.. ఇప్పటివరకు 8 మందిని శిథిలాల నుంచి వెలికి తీశారు..

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. గర్భిణీ సహా బాలిక మృతి
building collapsed in delhi

ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం బుధవారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో గర్భిణితో పాటు ఓ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు.


డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రక్షక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాయంతో ఇప్పటివరకూ 8 మందిని రక్షించి.. బాధితులను స్థానిక రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. ఈ ప్రమాదంలో గులాఫ్సా(21) అనే నాలుగు నెలల గర్భిణీ సహా పన్నెండేళ్ల బాలిక మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. రక్షణ చర్యలను ముమ్మరం చేశామన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని సత్యనికేతన్ హాస్టల్ భవనం కూలిన నెల రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విషాదకరమని ఆయన అన్నారు.


రక్షణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సీమాపురి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. మంగళవారం రాత్రి ఉత్తరాఖండ్‌లో సంభంవించిన భూకంప ప్రభావంతో ఢిల్లీ ఫాల్ట్ మీదుగా ఉన్న ఈ ప్రాంతంలో పగుళ్లు వచ్చాయని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే.. భవనం కూప్పకూలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు

జాతీయస్థాయి కుంభకోణాలపై దృష్టి పెట్టండి

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Oct 08 , 2026 | 09:00 AM