Share News

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:47 AM

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే
CM Chandrababu Naidu

ఢిల్లీ, అక్టోబర్ 8: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని.. దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.


ఇవి కూడా చదవండి...

‘పోలవరానికి నిధుల కొరత రాకుండా చూడండి’.. కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 11:48 AM