Share News

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:34 AM

34 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించిందంటే.. ఎంత అవగాహనారాహిత్యంలో ఉందో అర్థమవుతోందన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, అక్టోబర్ 8: 34 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించిందంటే.. ఎంత అవగాహనారాహిత్యంలో ఉందో అర్థమవుతోందన్నారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై తాము చాలా స్పష్టంగా ఉన్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముకని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది రేపు(శుక్రవారం) తెలుస్తుందన్నారు.


సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడిన వెంటనే షెడ్యూల్ వస్తుందని.. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలు పూర్తైన తరువాత నియామక పదవులపై దృష్టి సారిస్తామన్నారు. కార్పొరేషన్ చైర్మన్ల పనితీరును సమీక్షించి రెన్యువల్ విషయం ఆలోచిస్తామని తెలిపారు. ఏదైనా స్థానిక ఎన్నికలు పూర్తైన తరువాతే నియామక పదవుల విషయం గురించి ఆలోచిస్తామన్నారు. తామైతే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. రిజర్వేషన్లు రొటేషన్ కావాలి కదా అని అన్నారు. తప్పనిసరిగా రిజర్వేషన్లు రొటేషన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నానా పటేకర్ మరణవార్త తెలిసి చింతిస్తున్నా: పవన్ కల్యాణ్

‘పోలవరానికి నిధుల కొరత రాకుండా చూడండి’.. కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 11:38 AM