శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:30 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి.కృష్ణతేజ, శిలాతోరణం, బాటగంగమ్మ సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్ వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.16 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 68,265
తలనీలాలు సమర్పించినవారు: 26,959
ఈ వార్తలు కూడా చదవండి:
చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: బొత్స
Read Latest AP News And Telangana News And International News And Telugu News