నియోజకవర్గానికో లేబర్ అడ్డా
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:40 AM
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మె రుగైన వసతులు, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పు న ఆధునిక ‘లేబర్ అడ్డాల’ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఏసీ హాల్, విశ్రాంతి గదులతో కార్మికులకు ఆధునిక వసతులు
సంక్షేమ పథకాల నమోదు, నైపుణ్య శిక్షణకు వేదిక
యాప్ ద్వారా యజమానులకు కార్మికుల సేవలు అనుసంధానం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మె రుగైన వసతులు, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పు న ఆధునిక ‘లేబర్ అడ్డాల’ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 అడ్డాలను నిర్మించగా, జిల్లాలో తాడేపల్లిగూడెం లో నిర్మాణం పూర్తయింది. మిగిలిన అన్ని నియో జకవర్గాల్లో ఒక్కొక్కటి, జిల్లా కేంద్రమైన భీమ వరంలో రెండు అడ్డాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల తోనే ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్ర బాబునాయుడు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఏసీ వసతితో విశ్రాంతి
పనుల కోసం రోడ్లపై ఎండన పడి పడిగాపు లు కాసే దుస్థితికి చరమగీతం పాడుతూ కార్మి కుల కోసం ఈ అడ్డాల్లో ఏసీ సౌకర్యంతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రీసోర్స్ పర్సన్లను నియ మిస్తారు. ప్రస్తుతం పంచాయతీ కార్యాలయాల్లో సాగుతున్న కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై లేబర్ అడ్డాల్లోనే జరగనుంది. కార్మికుల పిల్లల వివాహ కానుకలు, ప్రమాద బీమా, వైద్య సదు పాయాలు వంటి సంక్షేమ బోర్డు పథకాల దరఖాస్తులను ఇక్కడే స్వీకరించి పర్యవేక్షిస్తారు. పనుల్లో తగిన ప్రావీణ్యం లేని వారికి, పని దొర కని కార్మికులకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఇచ్చి నైపు ణ్యాలను మెరుగుపరుస్తారు.
యాప్ ద్వారా ఇంటి వద్దకే సేవలు
దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఏర్పా టవుతున్న ఈ లేబర్ అడ్డాలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తున్నారు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, తాపీ మేస్త్రీ, వడ్రంగి వంటి సేవలు అవసరమైన ఇంటి యజమానులు నేరుగా బుక్ చేసుకు నేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. లేబర్ అడ్డాలో నమోదైన కార్మికుల వివరాలన్నీ ఈ యాప్‌లో అందు బాటులో ఉంటాయి. అత్యవసర సమయా ల్లోనూ, నిర్దిష్ట తేదీల్లోనూ అవసరమైన నిపు ణులను యజమానులు యాప్ ద్వారా బుక్ చేసుకుని సేవలందించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన జాతీయ స్థాయి కార్మిక శాఖ సదస్సుకు రాష్ట్ర బోర్డు చైర్మన్ వలవల బాబ్జి హాజరై ఇతర రాష్ట్రాల పథకాలతోపాటు రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్టు వివరాలను పంచుకున్నారు. ఈ నూతన విధానం నిర్మాణ రంగ కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచనుంది.