Share News

జగన్‌ యూరప్‌ పర్యటనకు షరతులు

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:06 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ 15 రోజుల యూరప్‌ పర్యటనకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

జగన్‌ యూరప్‌ పర్యటనకు షరతులు

  • ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ 15 రోజుల యూరప్‌ పర్యటనకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 30 మధ్య జగన్‌ యూరప్‌ వెళ్లేందుకు కోర్టు సమ్మతించింది. యూరప్‌ వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వాలని స్పష్టం చేసింది. పర్యటనలో ఉండే ఫోన్‌ నంబరు, ఇ-మెయిల్‌ను సీబీఐకు ఇవ్వాలని ఆదేశించింది.

Updated Date - Sep 19 , 2026 | 06:06 AM