Share News

చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: బొత్స

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:21 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గరివిడిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘

చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: బొత్స

గరివిడి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గరివిడిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘కొంతమంది నేను రాజ్యసభకు వెళ్లిపోతానని, మరొకరు ఇక్కడ పోటీ చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. చీపురుపల్లి నుంచే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తా’ అని ప్రకటించారు. తాను మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందినవారు పార్టీని వీడారని పరోక్షంగా టీడీపీలో చేరిన.. తన మేనల్లుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును విమర్శించారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తుందని, తనకు మంత్రి పదవి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష మాట్లాడారు. ఆమె జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేరును ప్రస్తావించిన సమయంలో బొత్స మరోసారి కంటతడి పెట్టారు. తనపట్ల చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి సంతోషంతో కంటతడి పెట్టానని ఆయన సమర్థించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 05:21 AM