మన్యంలో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:18 PM
మన్యంలో శుక్రవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. తర్వాత నుంచి సాధారణ వాతావరణం నెలకొని ఎండ కాసింది.
ఉదయం పొగమంచు.. తర్వాత ఎండ
తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. తర్వాత నుంచి సాధారణ వాతావరణం నెలకొని ఎండ కాసింది. అలాగే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమైనప్పటికీ వర్షం కురవలేదు. కాని వేడి, ఉక్కపోత మాత్రం కొనసాగింది. అలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం నమోదవుతున్నాయి. కొయ్యూరులో శుక్రవారం 34.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జీకేవీధిలో 32.5, చింతపల్లిలో 31.9, పాడేరులో 31.6, అనంతగిరిలో 30.5, అరకులోయలో 30.4, డుంబ్రిగుడలో 29.6, జి.మాడుగులలో 28.7, ముంచంగిపుట్టులో 28.3, పెదబయలులో 27.4, హుకుంపేటలో 23.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.