శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:27 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.92 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,874
తలనీలాలు సమర్పించినవారు: 35,302
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News