శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:56 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.80 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,445
తలనీలాలు సమర్పించినవారు: 36,834

ఈ వార్తలు కూడా చదవండి:
మూడోసారి తల్లైతే ఏడాది పాటు మాతృత్వ సెలవు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News