Share News

తిరుమలలో మంగళవారం క్లీనింగ్‌ డే

ABN , Publish Date - Aug 19 , 2026 | 02:04 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి మంగళవారం క్లీనింగ్‌ డేగా ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.

తిరుమలలో మంగళవారం క్లీనింగ్‌ డే
పాత్రలను శుభ్రం చేస్తున్న దుకాణదారులు

తిరుమల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి మంగళవారం క్లీనింగ్‌ డేగా ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేలా పాస్ట్‌ఫుడ్‌ నిర్వాహకులపై పలుమార్లు భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ ఆదేశాలతో ఆరోగ్యశాఖ రంగంలోకి దిగారు. దీంతో ప్రతి మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు మూసివేసి.. శుభ్రం చేసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మూడో సత్రం, పీఏసీ-1, పీఏసీ-2 తదితర ప్రాంతాల్లో దుకాణాలు మొత్తం మూసివేసి శుభ్రం చేసుకున్నారు. బొద్దింకలు, ఎలుకలు, పిల్లులు లేకుండా చూసుకోవాలని దుకాణదారులకు ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.

Updated Date - Aug 19 , 2026 | 02:04 AM