Share News

కెనడియన్‌ పౌరుడికి ఇంపోటెన్సీ పరీక్ష

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:59 AM

పాస్‌పోర్టు, కెనడియన్‌ పౌరసత్వం, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఇంపోటెన్సీ (నపుంసకత్వం) పరీక్ష చేయించారని ఓ వ్యక్తి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కెనడియన్‌ పౌరుడికి ఇంపోటెన్సీ పరీక్ష
Canadian Citizen

  • రూ. 2 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్‌

హైదరాబాద్: పాస్‌పోర్టు, కెనడియన్‌ పౌరసత్వం, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఇంపోటెన్సీ (నపుంసకత్వం) పరీక్ష చేయించారని ఓ వ్యక్తి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దొమ్మరపోచంపల్లిలో ఉంటున్న ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. అతడు కెనడా పౌరుడు. గత నెల 7న అతడికి తెలియకుండా పాస్‌పోర్టు, కెనడా పౌరసత్వం తదితర పత్రాలను భార్య, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్నారు.


అదేనెల 9వ తేదీన బెదిరించి సోమాజిగూడలో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి బలవంతంగా ఇంపోటెన్సీ పరీక్ష చేయించారు. వైద్య పరీక్షల అనంతరం తనకు ఇంపోటెన్సీ ఉందని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అసత్య ఆరోపణలు చేసి రూ.2కోట్లు డిమాండ్‌ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించిన, ఒత్తిడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. న్యాయస్థానం అనుమతితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 10:59 AM