నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:02 AM
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను టీటీడీకి ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది.
తిరుమల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను టీటీడీకి ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. అయితే అందులోని 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన టికెట్ల కోటాను మాత్రం హోల్డ్‌లో ఉంచింది. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈ తేదీలకు సంబంధించిన కోటాను అక్టోబరు 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక, బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలను(వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలు) టీటీడీ రద్దు చేసింది. పెరటాశి చివరి మాసంతో పాటు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీ అధికంగా ఉండే అవకాశముందని అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!