డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోంది.. మంత్రి నిమ్మల సెటైర్లు
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:24 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు. ఈరోజు (శనివారం) పాలకొల్లు నియోజకవర్గంలో రూ.2 కోట్లతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డీఎస్సీ నియమకాలను గొడ్డలి పార్టీ వ్యతిరేకించిందని ప్రస్తావించారు. కానీ నేడు నిరుద్యోగుల పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయాలకు వాడుకోవడం, వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
వైసీపీ రాజకీయ డ్రామాలకు తలోగ్గేది లేదు..
వైసీపీ రాజకీయ డ్రామాలకు తలోగ్గేది లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకోవాలని, 356 రిట్ పిటిషన్లు వేశారని ఆగ్రహించారు. డీఎస్సీ నియమకాలపై జగన్ ప్రశ్నించే ముందు ఆయన హయాంలో టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై రాజకీయాలు చేసే గొడ్డలి పార్టీని అభ్యర్థులు నిలదీయాలని అన్నారు.
జగన్ మాట తప్పారు..
పదేళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి, కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ నియమకాలు చేస్తానని హామీలు ఇచ్చి జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు. హామీలను మరిచినందుకు ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుది అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News