రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటాం.. సీఎం చంద్రబాబు భరోసా
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:49 PM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు.
పశ్చిమగోదావరి జిల్లా,అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) భరోసా కల్పించారు. నర్సాపురం మండలంలో నీట మునిగిన పొలాలను సందర్శించి, బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతన్నలు అధైర్యపడవద్దని పేర్కొన్నారు. తుఫాన్ నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం కూడా ఏపీలో పర్యటిస్తుందని వివరించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఈ రోజు (శుక్రవారం) నర్సాపురం, మొగల్తూరుల్లో ఏరియల్ సర్వే ద్వారా దెబ్బతిన్న పంటపొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అధ్యయనం చేశారు.
తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరిస్తా: సీఎం
పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం - పాలకొల్లు రోడ్డులోని కొత్త కాలనీ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వెళ్తుండగా ఖాళీ బిందెలతో మహిళలు నిల్చోని ఉన్నారు. మహిళలను చూసి సీఎం కారు దిగి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. తమ కాలనీ ఏర్పాటుచేసి 25 ఏళ్లు గడిచిందని.. నేటికీ నీళ్లు లేవని మహిళలు తెలిపారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News