Share News

భోగాపురం ఘనతంతా నాదే

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:57 AM

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్‌ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. ‘‘పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి’’ అని ‘ఎక్స్‌’ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

భోగాపురం ఘనతంతా నాదే
YS Jagan Mohan Reddy

  • చంద్రబాబు చేసిందేమీ లేదు: జగన్‌

అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్‌ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. ‘‘పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి’’ అని ‘ఎక్స్‌’ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనతంతా తనదేనని చెప్పుకొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 2014-19లోగానీ, గత రెండేళ్లుగా గానీ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ‘‘భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సమయంలోనే.. విశాఖ నుంచి విమానాశ్రయం వరకు రూ.6300 కోట్ల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర ఆరులేన్ల హైవేను తలపెట్టాం. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి, ప్రకటన చేయించాం.’’ అని తెలిపారు. పని వైసీపీది .. ప్రచారం చంద్రబాబుది ..క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌ అంటూ జగన్‌ వ్యాఖ్యానించారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:12 AM