వైసీపీకి షాక్.. 200 కుటుంబాలు టీడీపీ గూటికి..
ABN , Publish Date - May 19 , 2026 | 03:00 PM
విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్‌కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.
విజయనగరం, మే 19 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్‌కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి. ఈ భారీ వలసలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ మారిన నాయకులకు, కార్యకర్తలకు విజయనగరం శాసనసభ్యురాలు పూససాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన సభ్యులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమయ్యామని, టీడీపీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
కష్టపడే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు: అదితి గజపతి రాజు
చేరికల అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో టీడీపీ గ్రాఫ్‌ను మరింత పెంచేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను తీర్చడమే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని వ్యాఖ్యానించారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ పార్టీలో ఖచ్చితంగా తగిన గుర్తింపు, గౌరవం దక్కుతాయని హామీ ఇచ్చారు.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..
విజయనగరం జిల్లాలో ఈ వలసలు రాబోయే రోజుల్లో స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ఇప్పటికే అన్ని డివిజన్లలో పార్టీ విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టున్న డివిజన్ల నుంచి ఒకేసారి వందల సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడంతో వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు విజయనగరంలో టీడీపీని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News