భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:12 AM
భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు(శనివారం) ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం టెర్మినల్ భవనాన్ని ప్రధాని పరిశీలించారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. రూ.17,912 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ పాల్గొనని ప్రసంగించనున్నారు. బహిరంగ సభావేదిక దగ్గరకు ఓపెన్ టాప్ జీపులో ప్రధాని రానున్నారు.
టెర్మినల్ భవనాన్ని సందర్శిస్తూ ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష
Read Latest AP News And Telangana News And National News
And Telugu News