Share News

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:57 PM

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
PM Narendra Modi

విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు (శనివారం) ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం పలు ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మించారు. విశాఖపట్నం తర్లువాడలో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ తొలిదశకు శ్రీకారం చుట్టారు. రూ.468 కోట్ల వ్యయంతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టును ప్రారంభించారు.


కర్నూలు జిల్లాలో 4 రెన్యువబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.5,550 కోట్ల వ్యయంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ప్రారంభించారు. రూ.3,547 కోట్ల వ్యయంతో కర్నూలు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలులో రూ.823 కోట్ల వ్యయంతో.. చేపట్టిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకం ప్రారంభించారు. రూ.27 కోట్లతో పెంచలకోన-ఎర్రపాడు హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. రూ.763 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజీ-4, రూ.933 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజీ-5 ప్రారంభించారు. రూ.160 కోట్లతో తాడిపత్రి 4 లేన్ బైపాస్ నిర్మాణానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 01:44 PM