Share News

13 వేల మందితో థింసా

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:05 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

13 వేల మందితో థింసా

  • నృత్య ప్రదర్శనలో ‘మన్యం’ బాలికలు: మంత్రి సంధ్యారాణి

  • వారం రోజుల నుంచి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

విజయనగరం/పార్వతీపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. థింసా నృత్య బృందంలో భాగస్వామ్యం అవుతున్న మన్యం జిల్లా బాలికలకు బుధవారం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పాచిపెంటలో ఈ బస్సులకు మంత్రి లాంఛనంగా జెండా ఊపారు. ఆగస్టు 1న జరిగే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న సంగతి తెలిసిందే. మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు థింసా నృత్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


ఐటీడీఏల్లో ప్రాక్టీసు

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఐటీడీఏ పరిధిలో విద్యార్థినులు థింసా నృత్య ప్రదర్శనపై వారంరోజులుగా శిక్షణ పొందుతున్నారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, ఐడీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 8,9,10వ తరగతి చదువుతున్న సుమారు 14,000 మంది గిరిజన బాలికలు ఈ భారీ నృత్య ప్రదర్శనలో పాల్గొననున్నారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:12 AM