విమానాశ్రయంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:09 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు: మంత్రి కొలుసు పార్థసారథి
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 500 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు సంస్థ, ఏవియేషన్ విశ్వవిద్యాలయం, జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ, రూ. 2,388 కోట్లతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఉత్తరాంధ్రలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఐటీ సంస్థలు పారిపోయేలా చేశారని మండిపడ్డారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ సంతోషంలో ప్రజలు ఉంటే విషపుచుక్క వేసేలా జగన్ గురువారం శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారని చెప్పారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News