అల్లూరి ఏజెన్సీలో 50శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తాం: నాగబాబు
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:05 PM
రాబోయే ఎన్నికల్లో అల్లూరి ఏజెన్సీ నుంచి సుమారు 50 నుంచి 60 శాతం వరకు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు.
అల్లూరి జిల్లా, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో అల్లూరి ఏజెన్సీ నుంచి సుమారు 50 నుంచి 60 శాతం వరకు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు. అరకులోయలో ఈరోజు (సోమవారం) జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు పలు కీలక అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. అరకు ప్రాంతంపై జనసేన పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు.
ఈ ఏజెన్సీపై పవన్ కల్యాణ్‌కి ప్రత్యేక శ్రద్ధ...
గిరిజనుల కష్టాలు తీర్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తోందని నాగబాబు తెలిపారు. ఈ ఏజెన్సీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పుకొచ్చారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాలను ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ఇంకా గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో చేయాల్సింది ఉందని ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News