ఎన్డీఏ కూటమిలోనే గ్రామాల్లో అభివృద్ధి: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:17 PM
ఎన్డీఏ కూటమిలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆయా గ్రామాల్లో రోడ్లు వేశామని.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ కూటమిలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆయా గ్రామాల్లో రోడ్లు వేశామని.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత సుడిగాలి పర్యటన చేశారు. యస్ రాయవరం, పాయకరావుపేట మండలాల్లో పలు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను చూసి.. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. అడ్డరోడ్డు నుంచి నర్సీపట్నం రోడ్డును పూర్తి చేశామని తెలిపారు. నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, టాయ్ పార్క్ లాంటి పరిశ్రమలు వచ్చాయని వివరించారు. టాయ్ పార్క్‌తో 25 వేల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలు పాయకరావుపేట నియోజకవర్గానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని హోం మంత్రి అనిత కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News